Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో గురు పౌర్ణమి మహోత్సవాలు

వినుకొండలో గురు పౌర్ణమి మహోత్సవాలు

0

వినుకొండలో గురు పౌర్ణమి మహోత్సవాలు

న్యూస్ తెలుగు / వినుకొండ : 34వ గురు పౌర్ణమి మహోత్సవాలు వినుకొండ బోసు బొమ్మ సెంటర్ నందు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు గురువారం ఆలయం నందు పట్టణ ప్రముఖ చిత్రకారులు బొడ్డుచర్ల ప్రసాద్ రావు రంగులతో చిత్రీకరించిన భారీ సాయినాధుని చిత్రం బత్తులను విశేషంగా ఆకట్టుకుంది. గర్భగుడిలోని మూల విరాట్ సాయి విగ్రహానికి 11 వందల మామిడి పండ్లతో సహస్ర నామ పూజ సాయినాధునికి నిర్వహిస్తున్నట్లు ఈ నెల 29 ఆదివారం వరకు ప్రతిరోజు 11 గంటలకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ. శ్రీశ్రీశ్రీ శుద్ధ చైతన్యానంద స్వామి వారి శిష్య బృందం, శంకర సత్సంగం మరియు మహిళ భక్తులచే గురువారం మరియు ఆదివారం ఉదయం 6 గంటలకు, సాయంత్రం 9 గంటలకు అభిషేకాలు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఆలయ అధ్యక్షులు డి ప్రసాద్, కొల్లిపర సుబ్రహ్మణ్యం, దోసపాటి బాబు, ఐటిసి బాబు, కార్యవర్గ సభ్యులు తాతా పాండురంగారావు, మోటమర్రి నాగేశ్వరరావు, పి ప్రసాద్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు పోతు కూచి శ్రీనివాస శాస్త్రి, తదితరులు పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. (Story:వినుకొండలో గురు పౌర్ణమి మహోత్సవాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version