వినుకొండలో గురు పౌర్ణమి మహోత్సవాలు..
న్యూస్ తెలుగు / వినుకొండ :34వ గురు పౌర్ణమి మహోత్సవాలు వినుకొండ బోసు బొమ్మ సెంటర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు బుధవారం ఆలయం ఆవరణంలో రంగులతో భారీ వినాయకుడు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం నాడు 11 వందల మామిడి పండ్లతో రాస్తాననామ పూజ సాయినాధునికి నిర్వహిస్తున్నట్లు, ఈనెల 19వ తారీకు నుండి 29 ఆదివారం వరకు ప్రతిరోజు 11 గంటలకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ. శ్రీశ్రీశ్రీ శుద్ధ చైతన్యానంద స్వామి వారి శిష్య బృందం శంకర సత్సంగం మరియు మహిళ భక్తులచే గురువారం మరియు ఆదివారం ఉదయం 6 గంటలకు, సాయంత్రం 9 గంటలకు అభిషేకములు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఆలయ అధ్యక్షులు డి. ప్రసాద్, కొల్లిపర సుబ్రహ్మణ్యం, దోసపాటి బాబు, ఐటిసి బాబు, కార్యవర్గ సభ్యులు తాతా పాండురంగారావు, మోటమర్రి నాగేశ్వరరావు, పి.ప్రసాద్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు పోతు కూచి శ్రీనివాస శాస్త్రి, తదితరులు పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.(Story:వినుకొండలో గురు పౌర్ణమి మహోత్సవాలు..)
