Home వార్తలు తెలంగాణ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి

0

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి

న్యూస్‌తెలుగు / వనపర్తి : వనపర్తి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. జూన్ 20 నుంచి 26 జిల్లాలో వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు నిర్మూలన కార్యక్రమంలో భాగంగ బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి డ్రగ్స్ నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత మాదక ద్రవ్యాల వినియోగం బారిన పడకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు, సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా జరుగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణా పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జూన్ 26 న ఉదయం 7.00 గంటలకు స్థానిక బాయ్స్ జూనియర్ కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, పోలీస్ అధికారులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. (Story:డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version