Home వార్తలు తెలంగాణ అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలి: నేతలు

అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలి: నేతలు

0

అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలి: నేతలు

న్యూస్‌తెలుగు/వనపర్తి :  తమ ఆయుధాల వ్యాపార విస్తరణ కోసం దేశాల మధ్య యుద్దాలను ప్రోత్సహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఇరాన్ పై అమెరికా దాడికి వ్యతిరేకంగా ఎర్రజెండాలు ధరించి నిరసన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, తదితరులు మాట్లాడారు. ప్రపంచంలో యుద్దాలను ప్రోత్సహించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానవ వినాశనం చేస్తున్నారని విమర్శించారు. తమ దేశం అమెరికాతో అణు ఒప్పందం చేసుకోలేదన్న కారణంతో ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తున్నన్ని అంతర్జాతీయ అను శక్తి సంస్థ అమెరికా ఇంటలిజెన్సీ కూడా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించిన ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబుల వర్షం కురిపించారని, ఇది అమానుషమన్నారు. ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, పాకిస్తాన్ తదితర దేశాల మధ్య యుద్దాలను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధం వద్దు-ప్రపంచశాంతి ముద్దు అన్నారు. శాంతితోనే ప్రపంచ ప్రజలు సంతోషంగా ఉంటారని, ప్రపంచంలోనిదేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి అన్నారు. యుద్ధాలతో మానవ మనుగడకే ప్రమాదం అన్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని యుద్దాలను నివారించాలన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ,సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాబర్ట్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, జన జ్వాల,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్,పృధ్వి నాదం,లక్ష్మీనారాయణ, జయమ్మ, జ్యోతి,గంధం నాగరాజు,పాషా,విష్ణు తదితరులు పాల్గొన్నారు. (Story:అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలి: నేతలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version