బాల్యమిత్రుడి కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన తన బాల్యమిత్రుడు పెద్ద పాష కూతురు వివాహానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. కొత్తకోట లోని BPR గార్డెన్లో ఆదివారం నిర్వహించిన వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వధూవరులను ఆశీర్వదించి తన మిత్రుడితో కాసేపు మాట్లాడి వివాహానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి కాసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, పెద్దమందడి మండల మాజీ జడ్పిటిసి వెంకటస్వామి, గ్రామ నాయకులు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : బాల్యమిత్రుడి కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే )
