పర్యావరణ సైక్లిస్ట్‌కు చీఫ్ విప్ జీవీ రూ.10వేల సాయం
న్యూస్ తెలుగు/వినుకొండ : పర్యావరణ పరిరక్షణే థ్యేయంగా సైకిల్‌పై ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడుకు చెందిన సైక్లిస్ట్ ముత్తు సెల్వన్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వ ఛీప్ విప్, వినుకొండ ఎమ్మె ల్యే జీవీ ఆంజనేయులు అందించారు. పర్యావరణం కోసం కృషి చేస్తున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి, మరీ ముఖ్యంగా యువతకు ఎంతో ఆదర్శమన్నారు. కొయంబత్తూరు నుంచి మొదలు పెట్టిన తన యాత్రలో భాగంగా ఆదివారం వినుకొండకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి స్వాగతం పలికి, సాయం అందించారు. అనంతరం జీవి మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణ కోసం ముత్తుసెల్వన్ చేస్తున్న కృషి మరెంతో మందికి మార్గదర్శనం అన్నారు. పర్యావరణం కోసం ప్రతి చిన్న ప్రయత్నం కూడా గొప్ప మార్పుని తీసుకు ని వస్తుందని అభిప్రాయ పడ్డారు. అలానే ముత్తుసెల్వన్ సైకిల్ యాత్ర ప్రజల్లో చైతన్యం తెస్తూ, భూమిని కాపాడేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు. సైకిల్ యాత్ర ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గించి, పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహిస్తున్నందుకు అతడి ప్రత్యేకంగా అభినందిస్తు న్నా అన్నారు. మన భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు గుర్తించాలని పిలుపునిచ్చారు. ముత్తుసెల్వన్ మాట్లాడుతూ.. గిన్నీస్ రికార్డు సాధన కోసం 1,111 రోజుల పాటు 5 దేశాల్లో 34,300 కి.మీ యాత్ర సాగిస్తున్నట్లు చెప్పారు. 2021 డిసెంబరు 21న ప్రారంభించి నేపాల్, బంగ్లాదేశ్, వియత్నాం, థాయ్ లాండ్, బ్యాంకాక్, మయన్మార్ లో పర్యటించానని, వచ్చే ఏడాది డిసెంబర్ 21న దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ముగించనున్నట్లు సెల్వన్ తెలిపారు. పర్యటనలో భాగంగా పది లక్షల మొక్కలు నాటిస్తున్నట్లు చెప్పారు. సైకిల్ చుట్టూ పర్యటన వివరాలు తెలిపే బోర్డులు, జాతీయ జెండా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ముత్తు సెల్వన్ నరసరావుపేట వైపు యాత్ర సాగించారు.(Story : పర్యావరణ సైక్లిస్ట్‌కు చీఫ్ విప్ జీవీ రూ.10వేల సాయం )

