మృతురాలు దళిత రేణుకమ్మ కుటుంభాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి :పెద్దమందడి మండలం గట్లఖానాపూర్ గ్రామానికి చెందిన ఇంటినికి.రేణుకమ్మ ఇటీవల హత్యగావింపబడ్డది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామానికి చేరుకొని దళిత పెదకుటుంబంలో సంఘటన జరగడం దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు.భర్త లక్ష్మయ్య, కూతుర్లు,కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. నిరంజన్ రెడ్డి డి.ఎస్.పి కి ఫోన్ చేసి ఈ దురాగతానికి పాల్పడిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చి ప్రభుత్వపరంగా రావలసిన పక్కాగృహం,నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. దైర్యం కోల్పోకుండా పిల్లలను చదివించాలని నా సహకారం ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి వెంట మాజీ సర్పంచ్ వెంకటేష్,కోమటి.శ్రీను,హనుమంతు,శివరాములు,వడ్ల.గోవిందు,చిన్న కృష్ణ ఉన్నారు. (Story:మృతురాలు దళిత రేణుకమ్మ కుటుంభాన్ని పరామర్శించిన మాజీ మంత్రి)

