వినుకొండలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని పిట్టంబండ ,ఉమ్మడివరం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి జి .వరలక్ష్మి మాట్లాడుతూ. కౌలు రైతులు సి.సి.ఆర్.సి.కార్డులు లకు అప్లికేషన్లు, సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బందికి ఇవ్వాలని, తద్వారా కౌలు రైతు కార్డులు పొంది పంట నమోదు, క్రాప్ ఇన్సూరెన్స్, విత్తన రాయితీ, పంట రుణాలు పొందవచ్చు అని తెలిపారు. పి.ఎం. డి.ఎస్. కిట్లు రైతుల భూమిలో సాగు చేయడం ద్వారా భూమి సారవంతం అవుతుందని వివిధ రకాల బ్యాక్టీరియా అభివృద్ధి చెందునని తద్వారా భూమిలో ఉన్న అనేక రకాల పోషకాలు, విటమిన్లు, ఎంజైములు మొక్కకు లభించునని తెలియజేశారు .అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఏఏ డి .చాందిని, ఏ ఈ ఓ ఆరిఫ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో పొలం పిలుస్తుంది కార్యక్రమం)

