పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు /వనపర్తి : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం వనపర్తి పట్టణంలో పలు శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. SLV ఫంక్షన్ హాలులో నిర్వహించిన SLN రమేష్ మనవడి తొట్లే కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ఎంబి గార్డెన్ లో నిర్వహించిన పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్ గారికి మనవరాలి తొట్లే కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు .కమలా నగర్ కు చెందిన సత్యం ఈశ్వరమ్మ ల కూతురు పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు (Story:పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే)

