ఏరువాడ గ్రామంలో విజయవంతంగా వైద్య శిబిరం
డాక్టర్. ఉదయ్ కుమార్ రెడ్డి
న్యూస్ తెలుగు /చింతూరు : ఎక్కడ వైద్య అవసరం ఉంటే అక్కడ ఉండే వైద్య సేవలే నిజమైన ఆరోగ్య వ్యవస్థకు పునాది అనే నినాదంతో ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు తీసుకొని తులసిపాక వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి , చింతూరు మండలంలోని తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కు గ్రామమైన తులసిపాక నుండి సుమారు 15 కిలోమీటర్ దూరంలో ఉన్న 7 కొండలు దాటి ఉన్న ఏరువాడ గ్రామం లో వైద్య శిబిరం శుక్ర, శనివారం రెండు రోజులు నిర్వహించారు. భయంకరమైన అటవీ ప్రాంతంలో కొంత దూరం ట్రాక్టర్ పై వెళ్లి కొంత దూరం కాలినడక పై వ్యయ ప్రయాసలకు కోర్చి ఏరువాడ గ్రామ చేరుకొని వైద్య సేవలు అందించారు. అక్కడ ఉన్న 25 కుటుంబాలకు ప్రతి వ్యక్తికి వైద్య సేవలు అందించారు. ప్రతి ఇంటికి మలేరియా నివారణకు ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులపై జాగ్రత్తలు చెప్పారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలకు శుభ్రతపై విద్యా మార్గదర్శనం చేశారు. 25 కుటుంబాల్లో వంద మందికి మలేరియా జ్వరాలు అంటువ్యాధులకు చికిత్సలు చేసి, మందులు పంపిణీ చేశారు. దాతలు సహకారంతో కొండరెడ్లకు దుస్తులు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఏరువాడలో జరిగిన ఆరు పెళ్లిళ్లకు ముఖ్య అతిథులుగా, చుట్టాలుగా, డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైద్య సిబ్బంది ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. (Story:ఏరువాడ గ్రామంలో విజయవంతంగా వైద్య శిబిరం)

