ఘనంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ జన్మదిన వేడుకలు
పేదలకు అన్నదానం, బియ్యం పంపిణీ చేపట్టిన అభిమానులు
న్యూస్‌తెలుగు/విజయనగరం : జనసేన నాయకులు అవనాపు విక్రమ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం విజయనగరం జిల్లా కేంధ్రంలోని బాలాజి నగర్ లో ఆయన తన క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని ఆయన సందర్శించారు. ఈ శిభిరాన్ని జనసేన నాయకులు డాక్టర్ అవనాపు భావన ప్రారంభించారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజును పురష్కరించుకుని తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసేన శ్రేణులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. స్వచ్చంద రక్తదాతలకు జ్ఞాపికలను అందించారు. అనంతరం అవనాపు విక్రమ్ తన క్యాంపు కార్యాలయ ఆవరణలో అభిమానులు , కుటుంబ సభ్యులతో కలసి మొక్కలను నాటారు. అనంతరం తలసేమియా వ్యాధిగ్రస్తుల సమక్షంలో అవనాపు విక్రమ్ కేక్ కట్ చేసి, తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. బాధితులకు పౌష్టికాహార కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా నిరతి, సామాజిక స్పృహ కలిగిన జనసేన అధినేత, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. తలసేమియా బాధితుల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని మొక్కలు నాటడం, పేదలకు అన్నదానం, బియ్యం పంపిణీ, తలసేమియా వ్యాధి బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన శ్రేణులను, అభిమానులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మెగా ఫ్యామిలీ సీనియర్ అభిమానులు, కూటమి నాయకులు, వివిద సంస్ధల ప్రతినిధులు, నగర ప్రముఖులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు అవనాపు విక్రమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు , విక్రమ్ అభిమానులు పాల్గొన్నారు. (Story:ఘనంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ జన్మదిన వేడుకలు)