ప్రతి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండల కేంద్రాల్లో గురువారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గురువారం వనపర్తి శాసనసభ్యులుతూడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు 10ఏళ్ల BRS పాలనలో గ్రామాల్లోని నిరుపేద ప్రజలు సొంత ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గత పాలకులు నాడు ఏడాదికి 5 ఇల్లు ఇచ్చుకుంటు పోయిన నేడు ఇళ్లకు ఇంత డిమాండ్ ఉండేది కాదని ఎమ్మెల్యే అన్నారు. అయినా నేడు ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఖిల్లా ఘనపురం, పెద్దమందడి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రతి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..)

