ఆక్రమణలతో మూసుకుపోతున్న స్థానిక ఏనుగుపాలెం రోడ్డు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు.. అధికారులు స్పందించాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఏనుగుపాలెం రోడ్డు, రైల్వే గేట్ అవతల, గేట్ ఇవతల వైపు రోడ్డు ఇరువైపులా ఆక్రమణదారులు చొచ్చుకురావడంతో రోడ్డు మూసుకుపోతూ ప్రజలకు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. అధికారులు జాతీయ రహదారుల వైపు దృష్టి పెడుతున్నారే గాని స్థానిక ఈ ఏనుగుపాలెం రోడ్డు వైపు కన్నెత్తైనా చూడటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కాగా అద్దంకి వైపు ఒంగోలు, తిరుపతి ఆపై, ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు, కార్లు, తదితర ప్రైవేటు వాహనాలన్నీ ఈ ఏనుగుపాలెం రోడ్డు నుండే వెళుతుంటాయి. అలాగే రైల్వే గేట్ సమీపంలోనే వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు ఉండటంతో మార్కెట్ యార్డుకు వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు. అలాగే వినుకొండ మండలం నూజెండ్ల శావల్యాపురం మండలాల రైతాంగం తాము పండించిన ధాన్యం తదితర పంటలను ట్రాక్టర్ల పై తదితర వాహనాలపై మార్కెట్ యార్డుకు తీసుకు వెళుతుంటారు. ఈ క్రమంలో స్థానిక ఏనుగుపాలెం రోడ్డు ఆక్రమణలతో మూసుకుపోవటంతో రైతులు కూడా పలు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. అద్దంకికి వినుకొండ నుండి సుమారు 30 కిలోమీటర్లు దగ్గర దారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలన్నీ ఇటే వెళుతుంటాయి. వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల ఆర్ అండ్ బి రహదారి మార్జిన్‌ను దర్జాగా ఆక్రమిస్తున్నారు. రహదారిని ఆక్రమించి రేకుల షెడ్ నిర్మించిన పట్టించుకునే వారే కరువయ్యారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు తమ పరిధి కాదు, తమ పరిధి కాదంటూ కొన్నేళ్లుగా, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆక్రమణలకు అడ్డుచెప్పేవారు లేరు. దీనితో రహదారి ఇరు వైపులా ఆక్రమణలతో కుచించుకుపోయింది. విశాలంగా రహదారులు ప్రస్తుతం ఇరుకు రోడ్లుగా మారిపోయాయి. భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతతో ఎక్కడ ఖాళీ స్థలం కనపించినా పాగా వేసేస్తున్నారు. రోడ్లు ఇరుకుగా ఉండటంతో పెద్ద వాహనాలు ఎదురెదురుగా వస్తే తప్పుకునే అవకాశం లేక ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ అండ్ బీ రోడ్డును ఆక్రమించి శాశ్వతంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్డు స్థలం ఆక్రమించి రేకులు షెడ్ నిర్మించినా పట్టించుకునే వారే కరువయ్యారుఅధికారులు స్పందించి ఆర్ అండ్ బి రోడ్ల ఆక్రమణలను తొలగించి రోడ్లను విశాల పరచాలని ప్రజలు కోరుతున్నారు. (Story:ఆక్రమణలతో మూసుకుపోతున్న స్థానిక ఏనుగుపాలెం రోడ్డు)