కెటిఆర్ సమక్షంలో రావుల పుట్టినరోజు వేడుకలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : బి.ఆర్.ఎస్ పార్టీ కేంద్రకార్యాలయం,తెలంగాణ భవన్ హైదరాబాద్ నందు మాజీ ఎంపీ,మాజీ ఎం.ఎల్. ఎ, రాష్ట్ర బి.ఆర్.ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ సమక్షంలో ఘనంగా నిర్వహింపబడ్డాయి. కె.టి.ఆర్ కేక్ తినిపించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కె.టి.ఆర్ మాట్లాడుతూ రావుల గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి రాజకీయ అనుభవం పార్టీకి ఉపయోగపడాలని కోరారు.
కేంద్ర కార్యాలయములో పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేస్తూ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. .ఎల్.ఏలు,ఏం.ఎల్. సిలు,పార్టీ నాయకులు రావులకు శుభాకాంక్షలు తెలియజేశారు. (Story:కెటిఆర్ సమక్షంలో రావుల పుట్టినరోజు వేడుకలు)