శ్రీరామ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాభిషేకాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో ధర్మపురి రోడ్డులో ఉన్న దత్త సాయి సమర్థ పీఠంలో వెలిసిన శ్రీ రామ ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో అవధూత సాయి సుందర మహారాజ్ ఆధ్వర్యంలో సోమవారం సందర్భంగా అర్చకులు రామకృష్ణ శర్మ పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సుందర మహారాజ్ మాట్లాడుతూ దత్త సాయి సమర్థపీఠంలో ఇటీవల శిరిడి సాయిబాబా దేవాలయం తో పాటు శ్రీ రామ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్టించడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటితోపాటు ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఉత్సవ విగ్రహానికి ఉదయాన్నే పాలాభిషేకం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. దేవాలయంలో ఎప్పటికప్పుడు వివిధ పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటి షిరిడి సాయిబాబా దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున భక్తులంతా దేవాలయాల్లో జరిగే పూజలకు హాజరు కావాలని కోరారు. (Story:శ్రీరామ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాభిషేకాలు )

