గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
న్యూస్ తెలుగు/సాలూరు : గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంతో దోహతపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు పట్టణంలో గల దాసరి వీధిలో నూతనంగా ప్రారంభమైన నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆమె రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు. మొదట నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమానులైన డాక్టర్ బంకురు అప్పలనాయుడు, డాక్టర్ టంకాయల ద్రాక్షాయిని ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాలూరులో సాధారణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడంలో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవల పరంగా ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది,అని అన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్ దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దంపతులు ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వి గణేశ్వరరావు, డాక్టర్ ఆరిశెట్టి మోహన్ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేష్, మక్కువ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ )

