గంజాయి మూకలను పరామర్శిస్తే, వారిని ప్రోత్సహించినట్టే!
న్యూస్ తెలుగు/సాలూరు : గంజాయి మూకలను పరామర్శిస్తే, వారిని ప్రోత్సహించినట్టే!జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏంటో ప్రజలు ఈ దశలో బాగా అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి అమ్మాయిలను కొట్టి, హేళన చేస్తే పర్వాలేదా? కానీ ఆ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులపై నిందలు వేయడం నీ దుర్మార్గపు ధోరణి కాకపోతే ఇంకేమిటి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ, పోలీసులపై విమర్శలు చేస్తావా? అత్యాచారాలు, రేపులాంటి అత్యంత తీవ్రమైన నేరాల విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పేంటిది అని అన్నారు.31 కేసుల్లో నిందితుడైన నువ్వు గంజాయి కేసుల్లో అరెస్టయిన వారిని కాక మరెవరివద్దకు వెళ్తావని తెలిపారు.
అసలైన వెన్నుపోటుదారుడు నీవే అయిన నువ్వే ఇప్పుడు వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం… ‘‘దొంగే దొంగ అన్నట్టు’’ అనిపిస్తుందని అన్నారు.ఇప్పుడు గంజాయి నేరగాళ్లను పరామర్శించడం, వాళ్లను అమాయకులంటూ మాట్లాడుతున్న నీ మాటలు చూస్తే నీ మానసిక స్థితిపై ప్రజలు నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు.గత ఐదు సంవత్సరాల పాటు ప్రజలు నీకు పరిపాలన బాధ్యత ఇచ్చారు. కానీ ఆ స్థానం దుర్వినియోగం చేసి ఎన్నో అకృత్యాలు చేసి, ఇప్పుడు మళ్లీ తప్పుడు ఆరోపణలతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే ప్రజలు మాత్రం మళ్లీ మోసపోరు జగన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేశ్, మక్కువ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, గుల్ల వేణుగోపాల్ నాయుడు, ఏఎంసీ చైర్మన్, ముఖి సూర్యనారాయణ, పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.(Story : గంజాయి మూకలను పరామర్శిస్తే, వారిని ప్రోత్సహించినట్టే! )