Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో ఘనంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు

గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో ఘనంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు

0

గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో ఘనంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు / వినుకొండ : గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్టూడియో లో గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావిపాటి వీరయ్య మాట్లాడుతూ. కళాకారులకు వర్ధంతులు, జయంతులు చేయటం కళాకారులుగా మన బాధ్యత అని ఎస్పీ బాలు పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వందలాది వర్తమాన వర్ధమాన కళాకారులను తయారు చేశారని, ఐదు దశాబ్దాల పాటు చలనచిత్రాలకు పాటలు పాడి ఆబాల గోపాలాన్ని అలరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రావిపాటి వీరయ్య , నిడమానూరు సుబ్బారావు, ఉప్పలపాటి బ్రహ్మం, పాలడుగు వెంకటరావు , పారేళ్ళ ప్రసాద్, పత్తేపురం వెంకట్రావు, గుమ్మడి తదితరులు పాల్గొన్నారు. (Story:గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో ఘనంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version