ఈద్గా వద్ద వసతుల కల్పన
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీ వి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ఎమ్.సుభాష్ చంద్రబోస్ సూచనలతో. జూన్ 7వ తారీఖున జరుపుకోబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ కుంట నందు గల ఈద్గా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులను గత 2 రోజులుగా చేయించడం జరుగుతుంది.. పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ. ముస్లింల ముఖ్య పండుగల్లో ఈద్-ఉల్- అధా ఒకటని దీన్ని త్యాగానికి ప్రతీక గా జరుపుకుంటారని అన్నారు. అలాగే పండుగ రోజున ఈద్గా కు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story:ఈద్గా వద్ద వసతుల కల్పన)
