చింతూరులో ముమ్మరంగా వాహన తనిఖీలు
న్యూస్ తెలుగు / చింతూరు : చింతూరు, ఎర్రం పేట లలో ప్రాంతంలో జిల్లా యస్ పి అమిత్ బర్గర్, చింతూరు ఎస్పీ పంకజ్ కుమార్ మీనా,సి ఐ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు వాహనాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమ గంజాయి రవాణా నిరోధానికి, లైసెన్స్ లేని మైనర్ బాలురు, సీ బుక్కులేని వాహనాలు వేసుకొని తిరిగితే కేసులు తప్పవని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రథమ తప్పుగా భావించి విడిచిపెట్టారు. ఆటో లకు అన్ని డాకుమెంట్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. తనిఖీ లలో యస్ ఐ. రమేష్,కృష్ణ, ఎ యస్ ఐ. మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. (Story:చింతూరులో ముమ్మరంగా వాహన తనిఖీలు)

