Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అమరుల త్యాగాలతో ఎరుపుకెక్కిన ఎర్రజెండా

అమరుల త్యాగాలతో ఎరుపుకెక్కిన ఎర్రజెండా

0

అమరుల త్యాగాలతో ఎరుపుకెక్కిన ఎర్రజెండా

జూన్ 2న అన్ని మండల కార్యాలయాల వద్ద ఇళ్ల స్థలాల కొరకు ధర్నాలు జయప్రదం చేయండి

మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి

న్యూస్ తెలుగు /వినుకొండ : ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలతో ఎరుపెక్కిన ఎర్రజెండా పేద ప్రజలకు నిరంతరం అండగా ఉన్నదని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని ఒకటవ వార్డులోనే రెండవ శాఖ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం బడుగు జీవుల విముక్తి కోసం భూస్వాములు జమీందారులు జాగీర్దారులకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తమ విలువైన ప్రాణాలను తృణప్రాయంగాఅర్పించారని బలహీన వర్గాలకు అండగా ఉండి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నారని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అట్టడుగు వర్గాలు దళిత బలహీన వర్గాల అభ్యున్నతికి కార్మిక కర్షక వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు. నిరుపేద ప్రజలకు, రైతులు రైతు కూలీలకు సాగు చేసుకొనుటకు లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందని, రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరకై అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు.
నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని ప్రైవేటుపరం చేస్తూ ఆంధ్ర లో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి పూనుకున్నదని ప్రజా పోరాటాల వల్ల ప్రస్తుతం ఆగి ఉన్నదని ఆయన అన్నారు. మోడీ ఎన్నికలప్పుడు మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీసి రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోడీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకొని నిర్మించ తలపెట్టిన వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు కానీ కేంద్రం నుండి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఏమాత్రం ప్రకటించలేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానన్న నరేంద్ర మోడీ ధరలు విపరీతంగా పెంచారని పెట్రోలు, డీజీలు, గ్యాస్ తో సహా నిత్యావసర సరుకుల ధరలను కూడా అడ్డగోలుగా పెంచారని ఆయన తీవ్రంగా విమర్శించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లను అర్హులైన వారికి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలోని పార్టీ మహాసభలు జరుగుతున్నందున గ్రామీణ శాఖల నుండి మండల పట్టణ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర మహాసభలన్నీజరుపుతున్నామని పార్టీ శాఖలను నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ గ్రామ, వార్డులలో ఉన్నటువంటి సమస్యలను సమావేశాల్లో చర్చించి పరిష్కరించుటకు తీర్మానాలు చేసి పరిష్కరించాలని ఆయన కార్యకర్తలకు తెలిపారు. సమావేశానికి సోడాల సాంబయ్య అధ్యక్షత వహించగా కార్యక్రమం లో ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, మండల కార్యదర్శి రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున,షేక్ మస్తాన్ జల్లి వెంకటేశ్వర్లు
సమావేశం అనంతరం మహాసభ నూతన కమిటీని ఎన్నుకున్నదికార్యదర్శిగా–దార్ల సాంబయ్య, సహాయ కార్యదర్శులు గా తిరుమల శ్రీను, తిరుమల ఏసు ప్రేమ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భూక్య బుజ్జమ్మ, మూడవతు తూనియా భాయ్, భూక్య కోటమ్మ భాయ్, భూక్య గాయత్రి, మూడవత్ భవాని, మూడా వత్ మాధవి భాయ్, సీతమ్మ భాయ్, రాగుల తిరుపతయ్య, తిరుమల గోవిందు, స్వామి నాయక్ భూక్య, బండారు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. (Story:అమరుల త్యాగాలతో ఎరుపుకెక్కిన ఎర్రజెండా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version