Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చింతూరులో యోగా ర్యాలీ

చింతూరులో యోగా ర్యాలీ

0

చింతూరులో యోగా ర్యాలీ

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ఏజెన్సీలోని ప్రతి వ్యక్తి యోగా కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యకరంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌ.అపూర్వ భరత్ పేర్కొన్నారు. మంగళవారం చింతూరు సెంటర్ నుండి శబరి బ్రిడ్జి వరకు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో యోగ ర్యాలీ నీ ప్రాజెక్ట్ అధికారి ప్రారంభించి పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో ప్రాజెక్ట్ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పి ఓ అపూర్వ భరత్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో యోగ పై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా 1000 మందితో బుధవారం మోతుగూడెం ఫోర్ బే డ్యామ్ నందు మెగా యోగ కార్యక్రమం నిర్వహించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ యోగా కార్యక్రమం మే నెల 21వ తారీకు నుండి జూన్ నెల 21వ తారీకు వరకు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే యోగాకు మంచి గుర్తింపు ఉందని ఉందని అన్నారు. ప్రతిరోజు ప్రతి వ్యక్తి యోగా చేసి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి మాత్రమే కాదని ప్రతి వ్యక్తి యోగా కార్యక్రమాలు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి, తదితరులు పాల్గొన్నారు. (Story:చింతూరులో యోగా ర్యాలీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version