పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు భక్తులకు పుష్పాలంకరణలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం కావడం తో చదురు ,వనం దేవాలయాల వద్ద భక్తులు ఉదయం నుండే బారులు తీరారు .చదురుగుడిలో అమ్మ వారికి తెల్లవారుజామున పంచామృతాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు . భక్తులంతా పసుపు కుంకుమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు పూజారి బంటుపల్లి వెంకట్రావు, ధనుంజయ్ ప్రధాన అర్చకులు ఏడిద వెంకటరమణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులుఅందజేసిన మామిడి పండ్లు అమ్మవారి కి సమర్పించారు.వనంగుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారికి అలంకరణలు గావించి పూజలు నిర్వహించారు. దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీనియర్ అసిస్టెంట్లు ఏడుకొండలు, మణికంఠ ,జూనియర్ అసిస్టెంట్ రమేష్, తదితర దేవాదాయ సిబ్బంది చర్యలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో ఉదయం నుండి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. (Story:పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు)
