తెలుగు రాజకీయాల్లో కొత్త మలుపుగా లోకేష్ 6 శాసనాలు
తెలుగుదేశం పార్టీ బలం, బలగాన్ని చాటిన కడప మహానాడు
తొలిరోజు మహానాడులో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు తెలుగు రాజకీయాల్లోనే కొత్త మలుపు కాబోతున్నాయని చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న స్ఫూర్తిని కొనసాగిస్తునే తెలుగు జాతి, విశ్వ ఖ్యాతి, పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, యువ గళం, కార్యకర్తే అధినేత అన్న 6విధానాల ద్వారా రానున్న 40ఏళ్లకు పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరిలో నమ్మకం పెంచే ప్రయత్నం చేశారని అభినందించారు. వాటిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ 43వ మహానాడు కార్యక్రమంలో చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారాయ. కడప వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన 3రోజుల మహానాడు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్నిరోజులుగా అక్కడే ఉండే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. ఈ నేపథ్యంలో మంగళవారం తొలిరోజు మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. మహానాడు ప్రాంగణంలోని నరసరావుపేట పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆసక్తిగా పరిశీలించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు. (Story:తెలుగు రాజకీయాల్లో కొత్త మలుపుగా లోకేష్ 6 శాసనాలు)
