గ్రామాల వారిగా ఆర్ఆర్ సమావేశం
న్యూస్ తెలుగు / చింతూరు : చింతూరు డివిజన్ లో ఆర్ & ఆర్ గ్రామ సభలు పూర్తి అవటంతో ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు తదుపరి అర్ & ఆర్ కాలనీల కోసం మరియు ట్రైబల్స్ కి భూమికి భూమి, హౌస్ స్ట్రక్చరల్ వాల్యుయేషన్ మరియు నాన్ ట్రైబ్స్ కోసం హౌస్ ఆప్షన్స్ వంటి అంశాల మీద 30 గ్రామాల యొక్క ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పెసా కమిటీ మెంబెర్స్ తో ఐటిడిఏ చింతూరు మీటింగ్ హల్ నందు గ్రామాల వారిగా ది. 22.05.2025 నాడు రెండవ దశ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం ఐటిడిఏ చింతూరు సమావేశ మందిరంలో ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు ఇంటరాక్ట్ అవటం జరుగుతుంది అని ఈ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అర్ &ఆర్ కి సంబంధించి గ్రామ సభలో దరఖాస్తు ఇవ్వలేని నిర్వాసితులు ఇంకా ఎవరు అయిన ఉంటే వారు కూడా దరఖాస్తు సమర్పించుకోవచ్చు అని అర్ & ఆర్ ప్యాకేజీ సంబంధించి ఇది ఆఖరి అవకాశం అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు పేర్కొన్నారు. ఇంతకు ముందు గ్రామసభలో దరఖాస్తులు సమర్పించిన వారూ మరల రావాల్సిన అవసరం లేదని చెప్పినారు. గ్రామ సభలో స్వీకరించిన దరఖాస్తులను వెరిఫై చేసి అర్హులకు అప్రూవల్ ఇవ్వటం ప్రస్తుతం జరుగుతుంది అని మరో పది రోజులలో అన్ని గ్రామసభల దరఖాస్తులు వెరిఫికేషన్ పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో అందరూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు మరియు తహశీల్దార్లు పాల్గొంటారని ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ తెలిపారు.. వారి ఆదేశాల మేరకు ఈ క్రింది విధముగా 30 గ్రామాలకు ది .22.05.2025 ( గురు వారం) షెడ్యూలు ఇవ్వటం జరిగినది.
వి ఆర్ పురం మండలం
1) సోములగూడెం – 9:00 టూ 09:15
2) ధర్మ తాళ్ళ గూడెం – 09:15 టూ 09:30
3) ప్రతిపాక – 09:30 టూ 09:45
4) కన్నయ్యగూడెం – 09:45 టూ 10:00
5) శబరి రాయి గూడెం – 10: 00 టూ 10:15
6) చొప్పలి 10:15 ఎ యం టూ 10:30 ఎ యం
7) కొప్పలి – 10:30 ఎ యం టూ 10:45 ఎ యం
8) అడవి వెంకన్న గూడెం – 10:45 ఎ యం టూ 11:00ఏ యం
9) రామవరం 11:00 ఎ యం టూ 11:15 ఎ యం
10) రామవరం పాడు – 11:15 ఏ యం టూ 11:30 ఎ యం
11) వడ్డి గూడెం – 11:30 ఎ యం టూ 11:45 ఎ యం
12) రాజుపేట – 11:45 ఎ యమ్ to 12:00 పీఎం
13) వి అర్ పురం – 12:00 టూ 12:15 పి యమ్
14) రాజుపేట కాలనీ – 12:15 పీఎం టూ 12:30 పీఎం
15) గుండు గూడెం – 12:30 పీఎం టూ 12: 45 పీఎం
16) చింతరేగు పల్లి – 12: 45 పీఎం టూ 01:00 పీఎం
కూనవరం మండలం
1) పండ్రాజు పల్లి 01:00 పీఎం టూ 01:15 పీఎం
2) పేదర్కూరు – 01:15 పీఎం టూ 01:30 పీఎం
3) టేకు బాక – 01:30 పీఎం టూ 01:45 పీఎం
4) శబరి కొత్తగూడెం – 01:45 పీఎం టూ 02:00 పీఎం
5) వాల్ఫెర్డ్ పేట – 02:00 పీఎం టూ 02:15 పీఎం
6) కొండ్రాజు పేట – 02:15 పీఎం టూ 02:30 పీఎం
7) కూడలి పాడు – 02:30 పీఎం టూ 02:45 పీఎం
8) టేకుల బోరు – 02:45 పీఎం టూ 03:00 పీఎం
9) కూనవరం – 03:00 పీఎం టూ 03:15 పీఎం
చింతూరు మండలం
1) మల్లెతోట 03:15 పీఎం టూ 03:30 పీఎం
2) కోడేరూ – 03:30 పీఎం టూ 03: 45 పీఎం
3) ఉలుమూరు – 03:45 పీఎం టూ 04:00 పీఎం
4) చుట్టూరు – 04 : 00 పీఎం టూ 04:15 పీఎం
5) చింతూరు – 04:15.పి యం 04:30
ఇందు మూలంగా 30 ముంపు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మరియు పెసా కమిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు ప్రతి గ్రామం 20 మంది రావాలని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు కోరితున్నారు. అదీ విధంగా ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క గ్రామ శ్రేయస్సు కోసం వారి గ్రామం తరుపున వారి యొక్క అభిప్రాయలు ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారికి మరియు సదరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారికి తెలుపవచ్చు అని చెప్పినారు. గమనిక : అందరూ సమయ పాలన పాటించవలసిన కోరుతున్నామని తెలిపారు. (Story:గ్రామాల వారిగా ఆర్ఆర్ సమావేశం)

