కార్మిక చట్టాలను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఏఐటియుసి నాయకులు బూదాల
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక శివయ్య స్తూపం సెంటర్ లో ఏఐటియుసి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం ఏఐటీయుసి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శివయ్య స్తూపం సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుగా కుదించటం, అలాగే కార్మికులకు కనీస వేతనం ఇవ్వడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందటం, ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం కోసం పన్నాగాలు పొందటం, విశాఖ ఉక్కు లో పనిచేస్తున్న వివిధ రంగాల కార్మికులను తొలగించటం దారుణమన్నారు. దేశంలో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులకు గురి చేయటం, కార్మికులకు కార్మిక హక్కులను కాలరాస్తూ బిజెపి పార్టీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, వీటికి వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొండ్రముట్ల సుభాని, రాయబారం వందనం, కొప్పెరపు మల్లికార్జున, ఎస్కే మస్తాన్, వెంకటేశ్వర్లు ,సుభాని తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. (Story:కార్మిక చట్టాలను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు)

