Home వార్తలు తెలంగాణ రావుల పద్మమ్మ గారి జ్ఞాపకార్థం వెండి వస్తువులు వితరణ

రావుల పద్మమ్మ గారి జ్ఞాపకార్థం వెండి వస్తువులు వితరణ

0

రావుల పద్మమ్మ గారి జ్ఞాపకార్థం వెండి వస్తువులు వితరణ

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి అమ్మ కీ,,శే.రావుల వెంకటపద్మమ్మ గారి జ్ఞాపకార్థంగా ఆలయానికి శఠగోప్యము. స్థాలీ. ఉద్ధరిని. అరివేని పాత్ర. గంట మొత్తం “50 తులాల వెండి” వస్తువులను మొక్కుబడిగా అమ్మవారికి చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధనా చారి రావుల కుటుంబం పేరు పై అష్టోత్తరలతో ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి ప్రతిష్ఠ కోసం కష్టపడిన కమిటీ సభ్యులను రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించి సత్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో BRS మండల టౌన్ అధ్యక్షులు వనం రాములు, పెబ్బేర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే స్వామి, రాజశేఖర్, దిలీప్ రెడ్డి, మాధవరెడ్డి, గోల్డ్ బాలస్వామి,టి.యన్. ఎల్లారెడ్డి, సీతారాం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆంజనేయులు, ఎల్లయ్య , ఆలయ ప్రధాన కార్యదర్శి వడ్డే.ఈశ్వర్ (గురుస్వామి),BRS మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. (Story:రావుల పద్మమ్మ గారి జ్ఞాపకార్థం వెండి వస్తువులు వితరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version