డ్వాక్రా, ప్రభుత్వ పథకాల రుణాలకు కూడా సిబిల్
సహాయక సంఘాలు, యానిమేటర్లతో చీఫ్ విప్ జీవీ, మక్కెన సమావేశం
న్యూస్ తెలుగు / వినుకొండ : మారిన నిబంధనల్లో డ్వాక్రా రుణాలు మొదలు వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇచ్చే రుణాలకు కూడా సిబిల్ స్కోర్ తప్పనిసరిగా మారిందని, ఆ విషయాన్ని ప్రజలందరు గమనించాలని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. రూ. 10 వేలు, 20వేల నుంచి లక్ష లు, కోట్ల రూపాయల రుణాలకు కూడా సిబిల్ బావున్నవారికే బ్యాంకులు అప్పులు ఇస్తాయని, ఆ విషయంలో అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. గొర్రెలు, మేకల పెంపకం రాయితీ రుణాలతో పాటు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గారంటీ స్కీమ్ కింద ఇచ్చే అప్పులకి కూడా సిబిల్ స్కోరు బావుండాలన్నారు. శుక్రవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలు, యానిమేటర్లతో సమావేశం నిర్వహించారు. పీఎం అజయ్- ఉన్నతి పథకం కింద వినుకొండ నియోజకవర్గానికి చెందిన 13 మంది సభ్యులకు రూ.24.50 లక్షల విలువైన చెక్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆర్థిక సాధికారిత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా బ్యాంకులు సిబిల్ రేటింగ్ అడుగుతున్నాయని గుర్తు చేశారు. ఆ విషయంలో అందరు అవగాహ నతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిబిల్ స్కోర్ బాగో లేకుంటే ఎవరు సిఫార్సులు చేసినా బ్యాంకులు అప్పులు రావని గమనించాలన్నారు. అందుకే ప్రతిఒక్కరు సకాలంలో రుణాలు చెల్లిస్తూ సిబిల్ స్కోర్ కాపాడుకోవాలన్నారు. పీఎంఈజీపీ పథకం కింద వినుకొండకు 156 మంది కి అవకాశం ఇచ్చారని అధికారులు వాటికి సిబిల్ స్కోర్ ఉన్న వారినే వెతికి ఎంపిక చేయాలని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాలు తీసుకోవడంలో వినుకొండ ను పల్నాడు జిల్లా, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఆ లక్ష్యం చేరు కున్నవారికి రూ.20వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఇలా లోన్లు ఇప్పించడంలో, రుణాల రికవరిలో మొదటి స్థానంలో నిలిపిన వారికి మండలానికి ఇద్దరికి చొప్పున నగదు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఇలా రుణాలు తీసుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేవారు లాభసాటి, ఆధునిక వ్యాపారాలు ఎంచుకోవాలని సూచించారు. (Story:డ్వాక్రా, ప్రభుత్వ పథకాల రుణాలకు కూడా సిబిల్)

