Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆర్మీ జవాన్ మురళినాయక్ కి ఘననివాళి

ఆర్మీ జవాన్ మురళినాయక్ కి ఘననివాళి

ఆర్మీ జవాన్ మురళినాయక్ కి ఘననివాళి

న్యూస్ తెలుగు/సాలూరు : ఆర్మీ జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందిన వార్త రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసిందని, దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన ఆయన త్యాగం దేశమంతా గర్వపడేలా చేసిందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాలలు లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఆర్మీ జవాన్ మురళి నాయక్ వంటి వీర సిపాయిలు దేశం గర్వించదగిన వారని, దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించడం గొప్ప త్యాగమని” పేర్కొన్నారు.ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆ జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు.మురళి నాయక్ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు దేశ ప్రజలందరూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు పరమేశు, కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్, కునిశెట్టి భీమారావు, కారేపు చంద్ర, తదితరులు పాల్గొన్నారు.(STORY : ఆర్మీ జవాన్ మురళినాయక్ కి ఘననివాళి  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments