మన్యం కవిని వరించిన జాతీయ పురస్కారం
న్యూస్ తెలుగు/ చింతూరు : ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సంస్థగా పేరొంది సాహిత్య చరిత్రలో ప్రభంజనం సృష్టిస్తున్న ఐ యస్ ఓ గుర్తింపు పొంది తెలుగు భాష – తెలుగు సంస్కృతి తెలుగు వైభవం- తెలుగు సాహిత్యం – తెలుగు కళలు పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహిత్య కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న శ్రీశ్రీ కళావేదిక మే 10,11 తేదీలలో ఏలూరు లో నిర్వహించిన ప్రపంచ సాహితీ సంబరాలు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తిష్ గడ్, గుజరాత్, చెన్నై, కర్ణాటక రాష్ట్రాలనుండి 1000 మందికి పైగా కవులు కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మన్యం కవి నూనె రమేష్ ను సాహిత్య, సామాజిక రంగంలో చేస్తున్న సేవలనుగుర్తించి “జాతీయ యువ కీర్తి” ప్రతిభా పురస్కారాన్ని శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సి యి ఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ప్రపంచ ప్రసిద్ధ గజల్ గాయకులు గజల్ శ్రీనివాసు, శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయ కర్త కొల్లి రామావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టె లలిత, సాహితీ సంబరాల కన్వీనర్ పార్థసారధి ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. మూడు ప్రపంచ రికార్డ్ కవి సమ్మేళనాలలో పాల్గొని ప్రపంచ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకొని, పదుల సంఖ్యలో జాతీయ శతాదిక కవి సమ్మేళనాల పురస్కారాలు పొంది,ఐదు వందలకు పైగా సామాజిక ఈతివృత్తాలతో కవితలు వ్రాసి,రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాలలో కూడా సాహితీ పురస్కారాలు పొంది అనతి కాలంలోనే జాతీయ అవార్డు గెలుచుకున్న కవి రమేష్ ను గ్రామస్తులు, మండల ప్రముఖులు, స్నేహితులు అభినందించారు. ఇంతటి ఘనత సాధించడం పట్ల నూనె రమేష్ తల్లిదండ్రులు నూనె అజరయ్య దంపతులు ఆనందం వ్యక్తం చేసారు.(Story :మన్యం కవిని వరించిన జాతీయ పురస్కారం )
