Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 13న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

13న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

0

13న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఆదివారం ఇండో నేకప్ కెమికల్స్ వారి సహకారంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలతో మెగా వైద్య శిబిరం కాటూరి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వారి నిర్వాహణ లో జరగనుంది. ఈ నెల 13 వ తేదీ మంగళవారం స్థానిక నరసరావుపేట రోడ్డు లోని గంగినేని కల్యాణ మండపం ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శిబిరం ప్రారంభిస్థారు . సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగుతోంది. శిబిరం లో గుండె , ఊపిరి తిత్తులు, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, ఎముకలు కీళ్లు, తదితర ప్రధాన వైద్య విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షల తో పాటు మందులు కూడా ఉచితము గా అందజేస్తారు . కంటి పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన వారికి కళ్ల జోడు కూడా అందజేస్తామని చెప్పారు. ఉచిత కంటి ఆపరేషన్ కొరకు పేర్లు కూడా నమోదు చేసుకుంటారు. రోగులు తమ వెంట ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఆరోగ్య శ్రీ కార్డు కూడా తెచ్చు కోవలసినది. అన్ని పరీక్షలు అధునాతన కంప్యూటర్ అనుసంధాన పరికరాలు, వసతులు గల మొబైల్ వాహనము నందు నిర్వహించ బడును కావున వినుకొండ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించు కొని ఆరోగ్యవంతము అయిన జీవితం పొందవలసినది గా మెగా క్యాంప్ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.(Story : 13న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version