Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

0

న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం (మాక్స్ విజన్ డాక్టర్ రామలింగారెడ్డి కంటి ఆసుపత్రి నరసరావుపేట వారి సౌజన్యంతో) మరియు కోనెక్ డయాగ్నోసిస్ వారి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ ఆరోగ్య పరీక్షా కేంద్రం ను వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం. మహతి ప్రారంభించారు. ఈ కంటి వైద్య శిబిరం లో ఉచితంగా కంటి పరీక్షలు చేసి, రాయితీపై కళ్ళజోళ్ళు , మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఉచిత డయాబెటిక్ ఆరోగ్య పరీక్షా కేంద్రంలో రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. న్యాయవాదులు ,న్యాయవాద గుమస్తాలు,కోర్టు సిబ్బంది, పోలీసులు,bకక్షిదారులు అందరికి కంటి పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని న్యాయవాద సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, జాయింట్ సెక్రెటరీ నీలం శేఖర్ బాబు, ట్రెజరర్ వరగాని శివశంకర బాబు, జి వెంకటేశ్వర్లు, కే చెన్నకేశవరెడ్డి, కె ఎస్ ఎన్ వి నాయుడు, ఎన్ రమణారావు,వి అమర్ బాబు, డి నాగరాజు, ఎం మల్లికార్జున్ రెడ్డి, ఎన్ రామాంజనేయరెడ్డి, తదితర సీనియర్ , జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. (Story:న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version