సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ఎఐటియుసి -సిఐటియు కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఎ ఐ టి యు సి-సిఐటియు ఆధ్వర్యంలో వినుకొండ శివయ్య భవన్లో గురువారం నాడు ఉదయం 11 గంటలకు ఈనెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నాహకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ నాయకులు షేక్ కొండ్రముట్ల చిన్న సుభాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరుగునున్న సార్వత్రిక సమ్మెను ఉభయ కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు ఐక్య కార్యాచరణని రూపొందించుకొని జయప్రదం చేయాలని, ఈ లోగా విస్తృతంగా సార్వత్రిక సమ్మెను వివరిస్తూ కరపత్రాలు మైక్ ప్రచారం నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంకులు ఎల్ఐసి మున్సిపాలిటీ, ఆర్టీసీ తదితర పబ్లిక్ సెక్టార్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనే విధంగా ఆయా సంఘ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను నాలుగు కోడ్లు గా విభజించి కార్మికుల హక్కులను హరిస్తున్నారని రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయుటకు రైతు చట్టాలు తెచ్చి రైతులకు అన్యాయం చేయ తల పెట్టారని దీనిని గ్రహించిన రైతు సంఘాలు చారిత్రక పోరాటం చేసి తిప్పి కొట్టారని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉభయ కార్మిక సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నామని ఈనెల 17వ తేదీన సమ్మెను విజయవంతం చేయమని మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని, జిల్లావ్యాప్తంగా మైక్ ప్రచారం కరపత్రాల ప్రచారం రెండు రోజులు పాటు 10 నుండి12వ తేదీ వరకు నిర్వహించాలని తీర్మానించడమైనదని కావున ఆయా నియోజకవర్గాలలో ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఐక్యంగా పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు హనుమంత రెడ్డి మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారని ప్రభుత్వ విధానాలను నిలువరించాలని కార్మికులపై తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము, ఎ గోపాలరావు, బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ. కేంద్రం కార్మికులపైనే కాకుండా రైతులపై వ్యవసాయ రంగంపై కూడా తనకబంధహస్తాలను ప్రయోగించి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కార్యక్రమాన్ని ఉదృతం చేస్తున్నారని దీనిని గమనించిన కార్మికులు రైతు సంఘాలు ఏకమై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు రూపొందిస్తున్నారని దానిలో భాగమే ఈనెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మె అన్నారు. ఈ సమ్మెను గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బొంకూరి వెంకటేశ్వర్లు వెంకటప్పయ్య , ఎఐటియుసి నాయకులు పటాన్ లాల్ ఖాన్, రాయబారం వందనం, బూదాల చిన్న, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, షేక్ కిషోర్, కొప్పరపు మల్లికార్జునరావు, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రేవల్ల శ్రీనివాసరావు, షేక్ నాగూర్, పారిశుద్ధ్య కార్మిక నాయకులు సంపెంగుల అబ్రహం రాజు, శామంత పూడి సాయిబాబు, పచ్చి గొర్ల ఏసు, దేవమ్మ, కొప్పరపు మల్లికార్జునరావు, తదితరులు జండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. 17వ తేదీన సమ్మెను విజయవంతం చేయాలని మోటార్ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని, రెండు రోజులు మైక్ ప్రచారం నిర్వహించాలని కార్మికులు పబ్లిక్ రంగా సంస్థల ప్రాంతాలలో కరపత్రాల ప్రచారం చేయాలని నిర్ణయించారు. (Story:సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి)

