Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోట్లూరులో వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం

పోట్లూరులో వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం

0

పోట్లూరులో వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం

ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన ప్రత్యేక పూజలు

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం, పోట్లూరులో దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీమహాగణపతి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, శివలింగ, నందీశ్వర విగ్రహాలు, శిఖర కలశీ, శిలా ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జీడీసీసీబీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వీరికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా యంత్రస్థాపన చేసిన అనంతరం ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు దేవుళ్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. (Story:పోట్లూరులో వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version