Home వార్తలు తెలంగాణ శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబిక కమటీశ్వర స్వామికి రావుల పూజసామాగ్రి వితరణ

శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబిక కమటీశ్వర స్వామికి రావుల పూజసామాగ్రి వితరణ

0

శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబిక కమటీశ్వర స్వామికి రావుల పూజసామాగ్రి వితరణ

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణములో పాతబజార్ నందు ఇటీవల రోడ్ల విస్తరణలో బాగంగా కాళికామాత దేవాలయం నూతనంగా నిర్మించడం సంతోషదాయకం అని రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు.పాత బజార్ నందు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి కృషి వల్ల ఆలయాలు నూతన శోభ సంతరించుకున్నాయి అని అన్నారు. ఆలయ నిర్వాహకుల కోరికమేరకు రావుల చంద్రశేఖరరెడ్డి నిత్యపూజలకోసం వాడే శట్టగోపం,తీర్థం గిన్నె,గంట మొదలగు వెండి పూజ సామాగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా రావుల కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నిర్వాహకులు ఆలయ మర్యాదలతో సాదరంగా రావులను ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత,ఆత్మసంతృప్తి కలుగుతుందని భవిష్యత్తులో ఆలయానికి సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నిర్వాహకులు పూజ సామాగ్రి అందించిన రావులకు కృతజ్ఞతలు తెలిపారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్, సూర్యవంశం.గిరి,సునీల్ వాల్మీకి,ఎం.డి.గౌస్,చిట్యాల.రాము,నాగేష్,పరుశురాం,బాలరాజు,సూగురు.రాము,పోతులపల్లి.వెంకటేష్,రామస్వామి,ఖాదర్,తదితరులు పాల్గొన్నారు. (Story:శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబిక కమటీశ్వర స్వామికి రావుల పూజసామాగ్రి వితరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version