Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో పెనుగొండకు ఘన సన్మానం

విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో పెనుగొండకు ఘన సన్మానం

విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో పెనుగొండకు ఘన సన్మానం

న్యూస్ తెలుగు / వినుకొండ : కళ , సాహిత్యం , ప్రజా పోరాటాలకు లకు పుట్టినిల్లయిన వినుకొండ గడ్డ నా సొంత ప్రాంతం కావడం, ఇక్కడ నన్ను ఈ విధంగా సన్మానించడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. విద్యావంతుల వేదిక ఆధ్వరంలో జాషువా కళా ప్రాంగణంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయనను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఆయనను సురేష్ మహల్ సెంటర్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ వరకు కారులో ఊరేగింపుగా తీసుకెళ్లగా శివయ్య, గంగినేని, జాషువా విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. సీనియర్ న్యాయవాదిపీజే లూకా, కూచి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సభలో పెనుగొండ మాట్లాడుతూ. నాడు చెప్పులు లేకుండా తాను నడిచిన ఈ పుర వీధుల్లో నేడు కారులో ఊరేగించడం ఆనందంగా ఉందని కొంత ఉద్విగ్నానికి గురయ్యానని అందుకే వినుకొండను నేను మరువను, నన్ను వినుకొండ మరువదని చెప్పారు. అభ్యుదయ కవి పులుపుల శివయ్య చిన్న, వయస్సులో వేలు పట్టి బిడ్డగా నడిపించారని అందుకే ఆయన పేరుతో ప్రతి ఏటా సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే తాను సాహిత్యంలో ఎత్తుకు ఎదిగానన్నారు.
అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ పెనుగొండ నాలుగు దశల జీవన ప్రస్థానాన్ని దానితోనే అనుబంధంగా నడిచిన సాహితీ ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు .జాతీయ ఔన్నత్యాన్ని చాటే సాహితీవేత్తలు, కవులను ప్రభు త్వాలు గౌరవించాలని దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అది కరవైందన్నారు.
సీనియర్ న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యొక్క ఔన్నత్యాన్నీ అది రావడం వెనుక పెనుగొండ లక్ష్మీనారాయణ చేసిన కృషిని లక్ష్మి నారాయణతో తనకు గల అనుబంధాన్ని వివరించారు . అలాగే ఒకనాడు అత్యంత వెనుకబడిన ప్రాంతమయిన వినుకొండ నుండి తమవంటి కుటుంబాలు తూర్పు కు వలస వెళ్ళడానికి దారితీసిన పరిస్థితుల్ని వివరిస్తూ ఈ ప్రాంతం నుండి జాషువా తరువాత పెనుగొండ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్థాయికి ఎదగడం సంతోషమని ఆయన్ను ఘనంగా గౌరవిస్తున్న విద్యావంతుల వేదిక కార్యక్రమ నిర్వాహకుల్ని అభినందించారు విజేతలైన క్రీడాకారుల తరహాలో రాష్ట్రప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన వారిని సత్కరించి నగదు అవార్డులు ఇవ్వడం సముచితమని దానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ అంజనేయులు చొరవ తీసుకోవాలని సూచించారు.
ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న పెనుగొండను రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో గౌరవించేందుకు తాను చొరవ తీసుకుంటానని చెప్పారు. వేదిక సభ్యులు జాషువా ఓపెన్ ఆడిటోరియం వేదిక నిర్మాణం కోసం అభ్యర్ధించగా జాషువా కల్యాణ మండపంతో పాటు మరో రెండు ఓపెన్ ఎయిర్ థియేటర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పెనుగొండ లక్ష్మీనారాయణ ఆయన సతీమణి గీతను ఘనంగా సన్మానించారు. సభా సమన్వయ కర్తగా , వ్యాఖ్యాతగా కూచి రామాంజనేయులు వ్యవహరించారు . పెనుగొండ లక్ష్మి నారాయణ జీవన రేఖల్ని న్యాయవాది మనీషా సంక్షిప్త పరిచయం చేశారు వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య, విద్యావంతుల వేదిక వ్యవస్థాపకుడు సీహెచ్ఎల్ఎన్ మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్ షకీల , సీపీఐ జిల్లా కార్య దర్శి మారుతీ వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావు, ఆర్. వందనం, సీపీఎం పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు, గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ ఎండ్లూరి శేషగిరిరావు , సిపిఐ సీనియర్ నాయకులు సండ్రపాటి షైదా , వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మీసాల శ్రీనివాసరావు , సీనియర్ న్యాయవాది రామకోటేశ్వరరావు , కవి దుబ్బల దాసు , జాషువా సాంస్కృతిక అధ్యక్షులు జాన్ సుందరరావు తదితరులు ప్రసంగించారు. విద్యావంతుల వేదిక సభ్యులు రూబేను , దుగ్గేపోగు విజయ్ , సత్తార్ , సుధాకరరెడ్డి , సాలార్ , మస్తాన్ వలి , భాష , శ్రీనివాసరావు తదితరులు సభను విజయ వంతం చేసేందుకు మూల స్థంభాలై నిలిచారు . సభలో పాలుపోగు డానియల్ ఆర్కెస్ట్రా నేతృత్వంలో గాయనీ గాయకులు లావణ్య , వెంకటేశ్వర్లు , నాసర్ బాబు తదితరులు పాడిన గేయాలు సభికుల్ని అలరించాయి. ఇటీవలి పహల్గామ్ మృతులకు సభ నివాళుర్పించింది. న్యాయవాదులు మనీష , పగడాల అశ్వని లు సభాసదులచే శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని విద్యావంతుల వేదిక వ్యవస్థాపకులు సిహెచ్ ఎల్ ఎన్ మూర్తి పర్యవేక్షిస్తూ వినుకొండ చరిత్రను వివరిస్తూ పలు సూచనలు ఇస్తూ ప్రసంగించారు.(Story:విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో పెనుగొండకు ఘన సన్మానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!