Home వార్తలు తెలంగాణ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడతా

కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడతా

0

కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడతా

న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కార్యకర్త అడ్డాకుల.రవీంద్ర ఇటీవల ప్రమాదానికి గురై మరణించారు. నిరంజన్ రెడ్డి కుటుంబానికి మాట ఇచ్చిన ప్రకారం పార్టీ భీమా చెక్ వారి సతీమణి అడ్డాకుల.అంజలికి తాడిపర్తిలోని వారి ఇంటికి వెళ్లి అందించి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులకు, కార్యకర్తలకు ఆపద వస్తే అరనిముషములో వాలిపోతాను అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం కె.సి.ఆర్ గారు జీవిత భీమ కల్పించారని, గతములో రైతు భీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 5రోజులలో 5లక్షల రూపాయలు అందించిన ఘనత,కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లలకు అందించిన ఘనత,కె.సి.ఆర్ కిట్టు ద్వారా బాలింతలకు 13000వేల రూపాయలు అందించిన ఘనత ఈ దేశ చరిత్రలో కె.సి.ఆర్ గారిది అని కొనియాడారు. అన్నింటికంటే పేద కార్యకర్తలకు ప్రమాదం జరిగి చనిపోతే 2లక్షల భీమా ఇచ్చి కె.సి.ఆర్ అదుకున్నారని అన్నారు. నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు 24గంటలు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
గౌరవ నిరంజన్ రెడ్డి గారి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,మాజీ ఎం.పి.పి సంధ్య తిరుపతయ్య,, మన్యనాయక్,చంద్రశేఖర్,కృష్ణయ్య,శంకరయ్య,మోహన్,వనం.రాములు,పెద్దింటి.వెంకటేష్ ,చిట్యాల.రాము,నాగరాజు,శివ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. (Story:కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడతా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version