“పెనుగొండ”కు అభినందన సభ
న్యూస్ తెలుగు/వినుకొండ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2024) గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జాతీయ అధ్యక్షులు, న్యాయవాది పెనుగొండ లక్ష్మీ నారాయణకు విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు ఆ సంఘ సభ్యులు సీనియర్ న్యాయవాదులుపి. జె. లూకా, సి.హెచ్. ఎన్. ఎల్. మూర్తిలు వెల్లడించారు. పట్టణం లోని కోర్ట్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అభినందన సభ వివరాలు వెల్లడించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ 1954 అక్టోబర్ 24న గోవిందరెడ్డి లింగమ్మకు రెండవ సంతానంగా వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం,చెర్వుకొమ్ముపాలెంలో జన్మించారని తెలిపారు. మన ప్రాంతానికి చెందిన “పెనుగొండ ” సాహిత్య రంగంలో చేసిన సేవకు “దీపిక ” అనే వ్యాస సంపుటి కి ప్రతీష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించటం వినుకొండ ప్రాంతానికి ఎంతో గర్వకారణం అని తెలిపారు. జాషువా,పులుపుల వెంకట శివయ్యకి సాహిత్య వారసుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారని అలాంటి లక్ష్మీ నారాయణ ను సత్కారించు కోవటం మన అందరి భాద్యత అని అన్నారు. రేపటిలోకి, నూరెళ్ళ పులుపుల, దీపిక, విశేష, అనేక, గుంటూరు జిల్లా సాహిత్య చరిత్ర బహుళ ప్రాచుర్యం పొందిన పెనుగొండ లక్ష్మీ నారాయణ 1964లో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అవార్డు, తొలితరం మహాకవ గుఱ్ఱం జాషువా తరువాత అదే అవార్డు 2024 లొ ఘనతను పొందారని కొనియాడారు. అంతటి సాహిత్య కృషీ వళుడు “పెనుగొండ” కు సోమవారం సాయంత్రం 5 గంటలకు మునిసిపల్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో ని. జాషువా కళా ప్రాంగణం లో అభినందన సభ ఏర్పాటు చేయటం జరిగిందని, కార్యక్రమానికి అసెంబ్లీ చీఫ్ విప్, శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిధిగా, జీడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ దస్తగిరి ,అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, సీనియర్ న్యాయవాది చేరుకూరి సత్యనారాయణ విశిష్ట అతిధులు గా పాల్గొనే ఈ సభలో వినుకొండ నియోజకవర్గం లోని సాహిత్యాభిమానులు, కవులు, కళాకారులు, రచయితలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశం లో విద్యా వంతుల వేదిక సభ్యులు పాల్గొన్నారు.(Story : “పెనుగొండ”కు అభినందన సభ )