రెట్రో మూవీ ఈవెంట్ లోని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాటల్లో ట్రైబ్ అనే పదం వచ్చింది. ఈ మాటను కొందరు అపార్థం చేసుకుని హర్ట్ అయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో విజయ్ దేవరకొండ తన మాటలపై స్పష్టత ఇచ్చారు. ట్రైబ్ అని తను వాడిన పదం వెనక ఉద్దేశం భూమ్మీద తొలినాళ్లలో మనమంతా తెగలుగా, జాతులుగా ఉన్నామని చెప్పడమే కానీ అందులో షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కాదని విజయ్ వివరణ ఇచ్చారు. షెడ్యూల్ ట్రైబ్స్ వారిని తాను ఎంతగానో గౌరవిస్తానని, ప్రేమిస్తానని, వారూ మన సమాజంలో ఒక ముఖ్య భాగమని భావిస్తానని విజయ్ దేవరకొండ తన తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ – రెట్రో ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు కొందరిని ఇబ్బంది పెట్టాయనే విషయం నా దృష్టికి వచ్చింది. కానీ నా మాటల్లో ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. నేను మన సమాజంలో ఐక్యత ఉండాలి, ఒక్కటిగా మనమంతా ముందుకెళ్లాలనే చెప్పాను. దేశమంతా ఒక్కటిగా నిలబడాలని మాట్లాడాను. మానవ జాతి తొలినాళ్లలో ట్రైబ్స్, క్లాన్స్ గా ఉండేవాళ్లం. ఆ ఉద్దేశంతో ట్రైబ్ అనే మాట వాడాను. ఈ మాటకు ఎవరైనా హర్ట్ అయితే చింతిస్తున్నాను. శాంతి, పురోభివృద్ధి, ఐక్యత కోసం నా సినిమా మీడియంను ఉపయోగిస్తాను. అన్నారు. (Story:రెట్రో మూవీ ఈవెంట్ లోని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ)