ఘనంగా ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై
యువత పోరాటాలకు సిద్ధం కావాలి : ఏఐవైఎఫ్
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక శివయ్య స్థూపం వద్ద ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి దారి వేముల మరియు బాబు ఏఐవైఎఫ్ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మరియబాబు మాట్లాడుతూ. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాలు పైబడి అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేసారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 38bవేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న దాని ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. మరోపక్క ప్రతి నిరుద్యోగునికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చేటువంటి హామీను గాలికి వదిలేసారని మండిపడ్డారు. నిరుద్యోగులకు యువతకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సాలోమీ, పద్మ, మస్తాన్, మీరావాలి, సుభాని, మల్లికార్జున్, రవి, సాంబయ్య , తదితరులు పాల్గొన్నారు. (Story:ఘనంగా ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు)