Home వార్తలు తెలంగాణ పోరాడే వాడిదే ఎర్రజెండా: సిపిఐ నేతలు

పోరాడే వాడిదే ఎర్రజెండా: సిపిఐ నేతలు

0

పోరాడే వాడిదే ఎర్రజెండా: సిపిఐ నేతలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : న్యాయం కోసం హక్కుల కోసం పోరాడే వాడిదే ఎర్రజెండా అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ అన్నారు. మేడే వారోత్సవాల్లో భాగంగా గోపాల్పేట మండల కేంద్రం బస్టాండులో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె.చంద్రయ్య ఎర్రజెండా ఎగరేశారు. రమేష్ మాట్లాడుతూ.. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోడలుగా విభజించి నిర్వీర్యం చేసిందన్నారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిందన్నారు, సంగం పెట్టుకుని హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా చేసిందన్నారు. సంపన్నులకు కార్మిక శ్రమను దోచిపెట్టి అందుకే పనిగంటలు పెంచిందన్నారు. కార్మికులు హక్కుల కోసం ఐక్యమై పోరాడకుండా సంఘాలు పెట్టుకునేందుకు వీల్లేకుండా చేసిందన్నారు. కార్మికుల జీవితాలకు ఉరి తాళ్లు గా మారిన నాలుగు లేబర్ కోడులను కేంద్రం ఉపసంహరించుకునే దాకా పోరాడాలి అన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో సిపిఐ, ఏఐటీయూసీ శాఖలను ఏర్పాటు ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారం కార్మిక హక్కుల సాధనకు పోరాడాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకురుమయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కుర్మయ్య, మండల పార్టీ కార్యదర్శి నాగన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:పోరాడే వాడిదే ఎర్రజెండా: సిపిఐ నేతలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version