Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కార్మిక చట్టాల పైన మోటార్ కార్మికులకు అవగాహన ఉండాలి

కార్మిక చట్టాల పైన మోటార్ కార్మికులకు అవగాహన ఉండాలి

0

కార్మిక చట్టాల పైన మోటార్ కార్మికులకు అవగాహన ఉండాలి

న్యూస్ తెలుగు/సాలూరు : కార్మిక చట్టాల పైన మోటార్ కార్మికులకు అవగాహన ఉండాలని సాలూరు జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి హర్షవర్ధన్ అన్నారు. గురువారం మే డే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని, కార్మిక చట్టాల పైన అవగాహన సదస్సు సాలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా సాలూరు జూనియర్ సివిల్ జడ్జ్ మరియు చైర్మన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ జి హర్షవర్ధన్ మాట్లాడుతూ గౌరవ హైకోర్టు వారు సూచనలు మేరకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మోటార్ కార్మికులు ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తో పాటు కుటుంబ పోషన నిమిత్తం బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చట్టంలో ఉందని తెలిపారు. దీని పై కార్మికులందరూ అవగాహన చేసుకోవాలని అన్నారు. ఏదైనా న్యాయ సహాయం కొరకు మండల న్యాయ సంస్థను సంప్రదించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ అప్పలనాయుడు, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తీళ్ల జగన్నాథం, సీనియర్ న్యాయవాదులు అప్పలనాయుడు, శర్మ, కార్మికులు పాల్గొన్నారు. (Story:కార్మిక చట్టాల పైన మోటార్ కార్మికులకు అవగాహన ఉండాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version