Homeవార్తలుతెలంగాణపది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మదర్స్ ల్యాప్ విద్యార్థులు

పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మదర్స్ ల్యాప్ విద్యార్థులు

పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మదర్స్ ల్యాప్ విద్యార్థులు

విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : పదవ తరగతి పరీక్షల్లో వనపర్తి జిల్లా కేంద్రంలోని మదర్స్ ల్యాప్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి చరిత్ర సృష్టించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కే.సింధుశ్రీ 600కు గాను 574 మార్కులు సాధించి వనపర్తి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కృష్ణారెడ్డి అనే విద్యార్థి 538,అమృత 534 మార్కులు సాధించి ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచారు. 14 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి విజయ దుందుభి మోగించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి విద్యార్థులను శాలువతో సన్మానించి విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ ఎండి.అబ్దుల్ ముబీన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇదే విధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోని సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ఆయన అభినందించి ఆశీర్వదించారు. (Story:పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మదర్స్ ల్యాప్ విద్యార్థులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!