Homeవార్తలుతెలంగాణసిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ ఏఐటియుసీ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలలో మేడే ఉత్సవాలను నిర్వహించారు. సిపిఐ ఆఫీస్ వద్ద జిల్లా కార్యదర్శి విజయరాములు, ఎం సి హెచ్ వద్ద అధ్యక్షుడు శ్రీనివాసులు మెడికల్ కాలేజీ వద్ద ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ఫుట్ స్నేహ ఫుట్ పాత్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ నాయకులు శాంతన్న, కర్రెమ్మ గుడి వద్ద సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకుర్మయ్య, శ్రీనివాసపురం రోడ్డు లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వి నాదం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యూనియన్ అధ్యక్షుడు గంధం శీను, మెడికల్ కాలేజ్ వద్ద ప్రిన్సిపల్ కిరణ్మయి ఎం సి హెచ్ దగ్గర మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పతాకాలను ఆవిష్కరించారు. కేకులు కట్ చేసి పంపిణీ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి పోరాటాలతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పని దినం 8 గంటలకు 12 గంటలకు పెంచిందన్నారు. సంగం పెట్టుకునే హక్కు సమ్మె హక్కు హరించిందన్నారు. కష్టజీవుల శ్రమను దోచి సంపన్నులకు పెడుతోందన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా విభజించి నిర్వీర్యం చేసిందన్నారు. వాటికి పునరుద్ధరించే దాకా పోరాడాలన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, చిన్న కురుమన్న,గంధం శీను, పృథ్వి నాదం, వరుణ్, జయమ్మ, శిరీష, జ్యోతి, బాలరాజు, వెంకటమ్మ, రమణ,రాంబాబు,పల్లె స్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story:సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!