Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల వేధింపులు తాళ లేక భూక్యా రమేష్  ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులు తాళ లేక భూక్యా రమేష్  ఆత్మహత్యాయత్నం

0

పోలీసుల వేధింపులు తాళ లేక భూక్యా రమేష్  ఆత్మహత్యాయత్నం

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని బొమ్మరాజుపల్లి తండా లో గత మూడు రోజుల క్రితం వైసీపీ కార్యకర్తల ఇళ్ల పై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి, ఇళ్ల లోని సామానులు ద్వంసం చేసి మహిళలపై దాడులకు పాల్పడ్డారు. మహిళలపై దాడిని అడ్డుకున్న భూక్యా సోమ్లా నాయక్ తలపై రాడ్ తో కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో సోమ్లా నాయక్ తలకి 13 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన పై ఈపూరు పోలిసులు ఇరు వర్గాలవారిని పోలిస్ స్టేషన్ కు పిలిపించారు. వైసీపీ సానుభూతిపరులైన రమేష్ నాయక్ ను స్టేషన్ లో కానిస్టేబుల్ రమేష్, అంజి విచక్షణారహితంగా వంటి పై, కాళ్ల తో గుండేలపై కొట్టారు. ఈ దెబ్బలను తట్టుకోలేక భూక్యా రమేష్ నాయక్ శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రమేష్ నాయక్ ను ఈపూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈపూరు ప్రభుత్వ వైద్యశాలకు చెరుకుని రమేష్ నాయక్ ను పరామర్శించారు. అనంతరం వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో కూటమి నేతలు అలజడలు సృష్టించి, వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. బొమ్మరాజుపల్లి తండా లోని వైసీపీ కార్యకర్తలను పోలిస్ స్టేషన్ కు తీసుకవచ్చి అరికాళ్ళు చేతులపై, గుండేలపై కొట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గిరిజనుల పై ఈ విధమైన దాడులు ఎంతవరకు సమపూజ్యం అని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడ ప్రజలపై ఈ విధంగా దాడులు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత మహిళలపై, వృద్ధులపై, యువకులపై యదేచ్చగా దాడులు చేస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. (Story : పోలీసుల వేధింపులు తాళ లేక భూక్యా రమేష్  ఆత్మహత్యాయత్నం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version