పోలవరం-బనకనచర్ల అనుసంధానం పూర్తే చిరకాల స్వప్నం
కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : పోలవరం-బనకచర్ల లింక్ ద్వారా నదుల అనుసంధానాన్ని కళ్లారా చూడాలన్నదే ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చిరకాల స్వప్నం అని అన్నారు. ఆ దిశగా పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుమల వేంకటేశ్వరస్వామి అన్ని శక్తిసామర్థ్యాలు, అవకాశాలు ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. గురువారం ఈ మేరకు కుటుంబసమేతంగా తిరుమల శ్రీనివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర శ్రేయస్సు కోసం శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని అమరావతి , జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి కావాలని, తద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధానం సాకారమవ్వాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అది జరిగితే పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం మొత్తం కరవుకోరల నుంచి విముక్తి కావాలని తన చిరకాల వాంఛ నెరవేర్చాలని తిరుమల శ్రీవారివి వేడుకున్నట్లు తెలియజేశారు. ఆ కలియుగవైకుంఠనాథుడుని ఎప్పుడు దర్శించుకున్నా ఆధ్యాత్మిక శాంతి, ఉత్సాహం లభిస్తుందన్నారు. కుటుంబం అందరితో కలసి కలసి ఆ దర్శనభాగ్యం లభించడం అత్యంత ఆనందంగా అనిపించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అందిస్తున్న సేవలు ఎంతోమెరుగైన విషయాన్ని దగ్గరగా చూసినందుకు ఇంకాస్త సంతోషంగా అనిపించదన్నారు. శ్రీవారి ఆశీస్సుల తో ప్రజల సంక్షేమం, వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకృషి కొనసాగుతుందని తెలిపారు. జీవీ ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ లీలావతి, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ దంపతులు, తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.(Story:పోలవరం-బనకనచర్ల అనుసంధానం పూర్తే చిరకాల స్వప్నం)