ఉగ్రవాదుల దాడికి నిరసన దీక్ష చేపట్టిన కొంజేటి నాగశ్రీను రాయల్..
న్యూస్ తెలుగు /వినుకొండ : జమ్ము కాశ్మీర్ లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు వినుకొండ నియోజకవర్గం శివయ్య స్తూపం సెంటర్ నందు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ నిరసన దీక్ష చేపట్టారు. మతాల అడిగి టూరిస్ట్లని చంపడం ఎంతో బాధాకరమని, చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని… ఉగ్రవాదుల్ని వెంటనే హతమార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు లీగల్ సెల్ , రామ్ కోటేశ్వరరావు , నక్క రమణారావు, ముండ్రు చంద్రమోహన్, మీసాల శ్రీనివాసరావు,ఎలవర్తి శ్రీనివాసరావు, కే ఎస్ ఎం వి నాయుడు, వరగాని శివశంకర్ బాబు,బి శ్రీనివాసరావు, హనుమంతు, రవికుమార్, పవన్, టిడిపి టౌన్ అధ్యక్షు లు అయూబ్ ఖాన్ , సాగర్, జెకె కొండలరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు , గ్రామ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు జనసేన టిడిపి బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (Story:ఉగ్రవాదుల దాడికి నిరసన దీక్ష చేపట్టిన కొంజేటి నాగశ్రీను రాయల్..)