10 వ తరగతి పరీక్ష ఫలితాలలో గీతమ్స్ విద్యార్థుల విజయభేరి..
న్యూస్ తెలుగు / వినుకొండ : 2024-2025 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో గీతమ్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పాఠశాలకు చెందిన ఎన్. అంజనా 600 మార్కులకు గాను 594 మార్కులు, ఎం.గణేష్ కుమార్ రెడ్డి 600 మార్కులకు గాను 589 మార్కులు , టి. హృదయ లక్ష్మి 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా 580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 10 మంది , 570 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 27 మంది, 550 మార్కులకు పైగా సాధించిన వారు 57 మంది ,5 00 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 125 మంది అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మొమెంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం. కృష్ణవేణి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story: 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో గీతమ్స్ విద్యార్థుల విజయభేరి..)
