మదమంచిపాడు లో ఉత్సాహభరితంగా ఎడ్ల పందాల పోటీలు ప్రారంభం
“పల్లె పండగ” జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శనలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ సమీపంలో ని శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామివారి తిరుణాల సందర్భంగా శుక్రవారం వేలాదిమంది ప్రజలు సమక్షంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలను ప్రభుత్వ చిఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు లు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పోటీల నందు రెండు పళ్ళ ఎద్దులు ప్రారంభించారు. 650 కేజీల బండను రెండు పళ్ళ 23 జతలు ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. గెలుపొందని వారికి మొదటి బహుమతి 28 వేల రూపాయలు రామినేని. చంద్రయ్య, జ్ఞాపకార్థం ఆంజనేయులు, వెంకటేశ్వర్లు. పెదకంచెర్ల అందజేశారు. రెండో బహుమతి 25వేల రూపాయలు చప్పిడి. వెంకటేశ్వర్లు, లింగారావు, జ్ఞాపకార్థం వీరాంజనేయులు, జంగా లపల్లి వారు అందజేశారు మూడవ బహుమతి 21 వేల రూపాయలు కూచిపూడి. చిన్న వెంకయ్య ,మంగమ్మ, జ్ఞాపకార్థం చిన్న వెంకటేశ్వర్లు, సర్పంచి జంగాలపల్లి వారు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు మక్కెన. వెంకట్రావు, ప్రెసిడెంట్ అనుమాలు. సుబ్బారెడ్డి, మాదాల. చిరంజీవి, కుంటా. కోటిరెడ్డి. జగ్గరెడ్డి, అక్కిరెడ్డి. అబ్బి రెడ్డి, కూచిపూడి. చిన్న. వెంకటేశ్వర్లు, సెక్రెటరీ చాగంటి. యోగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ పావులూరి. సుబ్బారావు మాదినేని సుబ్బారావు ,నాగెండ్ల. వెంకట రామయ్య ,గరిమిడి. నారాయణ, మక్కిన. సుబ్బారావు, నంబూరి. కృష్ణారెడ్డి కూచిపూడి సుబ్బారావు, హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : మదమంచిపాడు లో ఉత్సాహభరితంగా ఎడ్ల పందాల పోటీలు ప్రారంభం)