ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే నెల 15వ తారీకు నుండి 18వ తారీకు వరకు అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు వాల్ పోస్టర్స్ శుక్రవారం వినుకొండ శివయ్య భవన్ సిపిఐ ఆఫీస్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి దారి వేముల మరియబాబు మాట్లాడుతూ. అఖిలభారత యువజన సమైక్య 1959 మే 3న ఆవిర్భవించడం జరిగిందని, ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దేశంలో యువతి, యువకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిందని, భారత దేశంలో 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంలో ఏఐవైఎఫ్ పోరాటం చేసిందని, దేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై అవినీతి అంతం ఏఐవైఎఫ్ పంతంగా ప్రతిజ్ఞ చేసి ఎన్నో విరోచిత పోరాటాలు చేసిందని, అటువంటి అఖిల భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభలు మే 15 నుండి 18 వరకు తిరుపతి నగరంలో జరుగుతుందని దీనికి వినుకొండ నుండి యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు భాస్కర్, ప్రసాద్, సుభాని, ఎస్. కె వలీ ,మస్తాన్, చంటి ,వెంకటేశ్వర్లు, మల్లికార్జున, గౌస్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story:ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ)